MBNR | ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను పరిశీలించిన ఎమ్మెల్యే

మక్తల్, మే 20 (ఆంధ్రప్రభ) : మక్తల్ పట్టణంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్ ను ఇవాళ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి ఆకస్మికంగా దర్శించారు. క్యాంటీన్ లోని కిచెన్, వంటకాలను పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులను వ్యాపారం ఎలా జరుగుతుంది వంటి వివరాలను తెలుసుకోవడంతో పాటు ఏమైనా సమస్యలున్నాయా ఉంటే వాటి పరిష్కారానికి మార్గాలు ఏంటనే అంశాలను నిర్వాహకులతో చర్చించారు.

అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లో టిఫిన్ చేశారు. వంటకాల నాణ్యత పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందించారు. నాణ్యతను ఇదేవిధంగా కొనసాగించాలని ఎమ్మెల్యే మహిళా శక్తి క్యాంటిన్ నిర్వాహకులకు సూచించారు. ఎమ్మెల్యే వెంబడి కాంగ్రెస్ పార్టీ నాయకులు కోళ్ళ వెంకటేష్, రహీం పటేల్, సాలం బిన్ ఉమర్ బస్రవి, శివరాంరెడ్డి, కావలి తాయప్ప, వాకిటి శ్యామ్, బోయ వెంకటేష్, యగ్నేష్ రెడ్డి, కట్ట వెంకటేష్, తదితరులున్నారు.

Leave a Reply