MLA| ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలి..
ఎమ్మెల్యే అనిల్ జాదవ్
MLA| ఇచ్చోడ, ఆంధ్రప్రభ : ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టాలి.. మానవ మనుగడను మెరుగు పరచాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) తెలిపారు. మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించిన మన బడి – మన నీరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ఇంకుడు గుంతల నిర్మాణనికి భూమిపూజ చేశారు.
అనంతరం మాట్లాడుతూ… ప్రతి నీటి చుక్క (Every drop of water) ను ఒడిసి పట్టాలి… మానవ మనుగడను మెరుగు పరచాలన్నారు. నీటిని ఒడిసి పట్టడం వల్ల ప్రకృతిని కూడా కాపాడవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

