MLA Donthi | ఆశీర్వదించండి… అభివృద్ధి చేస్తాం

MLA Donthi | ఆశీర్వదించండి… అభివృద్ధి చేస్తాం


MLA Donthi | చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : బోడ మాణిక్యం తండా గ్రామ ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపిస్తే… ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి భూక్య ఉమామోహన్ నాయక్ అన్నారు. బుధవారం ఆమె గ్రామ కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యుల అభ్యర్థులతో కలిసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. గత‌సారి జరిగిన ఎన్నికల్లో తన భర్త మోహన్ నాయక్ కొద్దీ ఓట్ల తేడాతో ఓటమి చెందినా.. గ్రామస్తుల కష్టసుఖాల్లో నిరంతరం తోడుగా ఉన్నామని, ఎమ్మెల్యే దొంతి ఆదేశాలు, మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సహకారంతో గ్రామ ప్రజలకు సేవ చేసేందుకు మరోసారి బరిలోకి దిగుతున్నామని, తమకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి, తమ పార్టీ బలపరిచిన వార్డు సభ్యుల గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే దొంతి సహకారంతో గ్రామానికి కావాల్సిన అన్ని పనులను సాధిస్తామని, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ అందేలా చూస్తామన్నారు.

Leave a Reply