పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల

పరామర్శించిన ఎమ్మెల్యే బండ్ల

గద్వాల (ప్రతినిధి) నవంబర్ 1 (ఆంధ్రప్రభ) : శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో, ఎర్రవల్లి మండలం ధర్మవరం బీసీ ప్రభుత్వ బాలుర పాఠశాల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన ఘటనపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (MLA Bandla KrishnaMohanReddy) బాధిత విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను ఆదరిస్తూ, వారికి ధైర్యం చెప్పిన ఆయన, వారి ఆరోగ్య పరిస్థితిని ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో తెలుసుకున్నారు.

ఎమ్మెల్యే మాట్లాడుతూ…. “ఇది చాలా బాధాకరమైన సంఘటన. శుక్రవారం రాత్రి 50 మందికి పైగా విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ వైద్యులు వెంటనే స్పందించి మెరుగైన చికిత్స అందించారు. విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అని తెలిపారు.

అదేవిధంగా, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు సంఘటనకు గల కారణాలను సమగ్రంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. బాధిత విద్యార్థులు ఈ రోజు డిశ్చార్జ్ అవుతారని తెలిపారు.

Leave a Reply