MLA | సత్వరమే పరిష్కరించాలి

MLA | సత్వరమే పరిష్కరించాలి
- అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు
- ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే
MLA | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అన్నారు. ప్రతి శుక్రవారం ‘ప్రజా దర్బార్’ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. టీడీపీ కృత్తివెన్ను మండల కార్యాలయంలో ఈ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలను స్వీకరించారు. వాటిని ఆయా శాఖల అధికారులకు అందించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
