MLA | అవినీతి లేని దేశంగా….

MLA | అవినీతి లేని దేశంగా….
- అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
MLA | నిజామాబాద్, ఆంధ్రప్రభ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మన ఇందూరు మన మేయర్ నినాదంతో ముందుకెళ్తు న్నామని..మున్సిపల్ కార్పొ రేషన్ పై కాషాయం జెండా ఎగరడం ఖాయమని అర్బన్ ఎమ్మె ల్యే ధన్పాల్ సూర్యనా రాయణ అన్నారు. నరేంద్ర మోడీ వరుసగా గత మూడు ధపాలుగా ప్రధానిగా దేశాన్ని పరిపాలిస్తూ ఏమాత్రం అవినీతి లేని దేశంగా భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
గురువారం నిజామాబాద్ నగరంలోని బిజెపి జిల్లా పార్టీ కార్యా లయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి అధ్యక్షతన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ సమక్షంలో నగరంలోని 22వ డివిజన్ నుండి మాజీ కార్పొరేటర్ పోతుల పురు షోత్తం, అదే డివిజన్ నుండి తాటికొండ రాము, ఆకుల శ్రీనివాస్, రాజ్ కుమార్, గౌత ఆనం ద్, కుందన్ శ్రీనివాస్ లతో పాటు సుమారు 200 మం ది డివిజన్ వాసులు బిజెపి పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి అర్బన్ ఎమ్మెల్యే పార్టీ కండు వాగప్పి పార్టీలోకి సాధా రంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ బిజెపి పార్టీ అంటేనే అభివృద్ధి అని అభివృద్ధి అంటేనే బిజెపి పార్టీ అని అన్నారు. ముఖ్యంగా ఎంపీ అరవింద్ జిల్లాలో చేస్తున్న విస్తృత అభివృద్ధి పనులకు ఆకర్షితులై, మున్సిపల్ ఎన్నికలకు ముందు బిజెపి పార్టీలో చేరడం శుభపరి ణామం అని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు తక్కువ ధరకే అందివ్వడం, అలాగే చిరు వ్యాపారులకు ముద్ర లోన్ పథకం కింద లక్ష రూపాయల వరకు రుణ సదుపాయాలు అంది వ్వడం, వాటి ద్వారా చిన్న, మధ్య తరగతి ప్రజలు స్వతహాగా వ్యాపారాలు నిర్వహించుకునేందుకు ఈ రుణాలు ఎంతగానో దోహ దపడుతున్నాయని ఆయ న అన్నారు. అదేవిధంగా కేవలం రూ.14 లతో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు లక్షల జీవిత బీమా కల్పించడం ప్రపంచంలో ఎక్కడా లేదని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ నుండి సుమారు 200 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బిజెపి పార్టీలో చే రారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
