MLA | ప్రజలందరూ మద్దతుగా నిలవాలి…

MLA | ప్రజలందరూ మద్దతుగా నిలవాలి…

  • గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

MLA | గుడివాడ – ఆంధ్రప్రభ : కుల మత ప్రాంత వర్గాలు చూడకుండా రాష్ట్రంలోని ప్రజలందరికీ మంచి చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.

గుడివాడ టీడీపీ కార్యాలయం ప్రజా వేదికలో ముఖ్యమంత్రి సహాయనిధి చేక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో ఈ రోజు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని 31 బాధిత కుటుంబాలకు మంజూరైన….రూ.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న బాధితులు సీఎం చంద్రబాబు… ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. అత్యవసర పరిస్థితుల్లో వైద్య చికిత్సలు చేయించుకునీ కష్టాల్లో ఉన్నవారికి సీఎం సహాయం నిధి పేరుతో అందించే సహాయం ఎంతో చేయూతనందిస్తుందన్నారు. గుడివాడ చరిత్రలో రికార్డు స్థాయిలో కూటమి 19 నెలల పాలనలో రూ.4 కోట్ల ముఖ్యమంత్రి సహాయనిధి నగదును బాధితులకు అందించామని ఎమ్మెల్యే రాము తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఎస్డబ్ల్యుసి చైర్మన్ రావి వెంకటేశ్వరరావు,జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ గడ్డ రవికుమార్, రూరల్ మండల మండల టిడిపి అధ్యక్షులు వాసే మురళి, మజ్జాడ నాగరాజు, టీడీపీ నాయకులు పండ్రాజు సాంబయ్య, షేక్ ఇబ్రహీం, ఆరేపల్లి పాండు, కోల్లారెడ్డి అంజిరెడ్డి, అడుసుమిల్లి శ్రీనివాస్,జనసేన నాయకులు సందు పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply