MLA | అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి

MLA | తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరులో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ లకు ఇవాళ ఎంపీడీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్, మండల కార్యదర్శి ఎండి యాకుబ్ లు మాట్లాడుతూ… మండల మండల కేంద్రంలోని గోపాలగిరి క్రాస్ రోడ్ లో నిర్మించిన 280 డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తయి నాలుగేళ్లు అవుతున్నప్పటికీ కూడా వాటిని పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు.
సీపీఎం పార్టీ తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో పేదలందరినీ కలుపుకొని దశలవారీగా అనేక పోరాటాలు చేస్తే సీపీఎం పార్టీ నాయకుల పేదల పైన నిర్బంధం, చేసి పార్టీ నాయకుల పైన కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కోసం ముందు నిలబడి ఇండ్లు అడిగినందుకు అక్రమంగా కేసులు పెట్టి సీపీఎం పార్టీ నాయకులను జైలుకు పంపారన్నారు. మున్సిపాలిటీలో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు ఇండ్లు పంపిణీ చేయాలని ఎమ్మెల్యే ను కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కొమ్మనబోయిన యాకయ్య, మండల కమిటీ సభ్యులు దొనక దర్గయ్య, జమ్ముల శ్రీను, తిమ్మిడి రవి, అమీర్, గడల సాయిలు, రేవూరి శ్రీను, ఎడ్ల ధర్మయ్య, వరలక్ష్మి, శ్రీలత, అమీనా, రాధా, నాగమణి, మంజుల, షమీనా, కృప, స్వర్ణ, యాకమ్మ, సమ్మక్క, పల్లె పద్మ, స్వాతి, యకలక్ష్మి, నాగమణి, కవిత, రాణి చైతన్య, మలేఖ, తదితరులు పాల్గొన్నారు.
