MLA | సామాన్యులకు అందుబాటులోకి నిత్యావసర వస్తువులు

MLA | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : సామాన్యులకు అందుబాటులోకి నిత్యాసర వస్తువులు తీసుకొస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధి పెద్దరెల్లి వీధి ప్రభుత్వ రేషన్ డిపో ద్వారా కార్డుదారులకు 20 రూపాయలకే కేజీ నాణ్యమైన గోధుమపిండిని ఎమ్మెల్యే గొండు శంకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. సామాన్యులకు అందుబాటులో నిత్యవసర వస్తువులు ఉండేవిధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని,అందులో భాగంగానే 20 రూపాయలకు గోధుమపిండిని అందిస్తున్నామని వివరించారు. సామాన్యులకు పౌష్టికాహారం ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
