MLA | ఎల్ఓసి అందజేత

MLA | ఎల్ఓసి అందజేత

MLA | మునుగోడు, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సౌజన్యంతో మంజూరైన ఎల్ఓసి ను పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు అందజేశారు. మండల కేంద్రానికి చెందిన నడిపల్లి శ్రీనివాస్ కు మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందజేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నడిపల్లి శ్రీనివాస్ కు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలసి ఎల్ఓసి కి దరఖాస్తు చేశారు.

శ్రీనివాస్ కు సీఎం సహాయ నిధి నుండి మంజూరైన రూ.2,50,000లు ఎల్ఓసి ను పట్టణ కాంగ్రెస్ నాయకులు వారి ఇంటికి వెళ్లి అందజేశారు. ఈసందర్భంగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… తమకి సహాయం చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి జితేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ జిట్టగోని యాదగిరి, పట్టణ అధ్యక్షులు సాగర్ల లింగస్వామి, మాజీ సర్పంచులు మిరియాల వెంకటేశ్వర్లు, పందుల నరసింహ, మండల పరిషత్ మైనారిటీ మాజీ కో ఆప్షన్ నెంబర్ ఎండి అన్వర్, పందుల మల్లేష్, వార్డు మెంబర్లు పందుల గంగాధర్, పందుల ప్రియాంక లింగస్వామి, పందుల రంజిత్, బీసం గంగరాజు, అబ్బనబోయిన బాలకృష్ణ, కాంగ్రెస్ నాయకులు మార్నేని గ్రెగోరి, పందుల అశోక్, దుబ్బ ప్రభాకర్, చిలువేరు సుదర్శన్, రేవెల్లి సైదులు, దుబ్బ రవి, కట్ట రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply