MLA | మసీదు ప్రారంభోత్సవం

MLA | మసీదు ప్రారంభోత్సవం
- హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
MLA | ఆంధ్రప్రభ, వీరులపాడు : వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన గౌసియా జామియా మసీదును అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మతసామరస్యమే భారతదేశానికి నిజమైన బలమని పేర్కొన్నారు. అన్ని మతాలూ.. మానవతా విలువలు, శాంతి, సోదరభావాన్ని బోధిస్తాయని తెలిపారు. గ్రామాభివృద్ధితో పాటు సామాజిక ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
