MLA | రుణం తీర్చుకుంటా…

MLA | రుణం తీర్చుకుంటా…
- నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటా..
- సమస్యలు పరిష్కరించేందుకు కృషి..
- తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
MLA | తిరువూరు, ఆంధ్రప్రభ : తన పై ఎంతో నమ్మకంతో, అభిమానించి ఆదరించి గెలిపించిన నియోజకవర్గ ప్రజల రుణం తప్పకుండా తీర్చుకుంటానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిన తిరువూరు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ రోజు వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజలతో మాట్లాడుతూ.. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారం చూపేందుకు ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు.
