MLA | మా ఊరు రావాల్సింది..

MLA | మా ఊరు రావాల్సింది..
ఆకివీడు, ఆంధ్రప్రభ : కోర్ట్ ఆర్డర్ ను ఎందుకు అమలు చేయలేదని అధికారులు నిలదీసిన తర్వాతే.. స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు చర్యలు తీసుకున్నారని కౌన్సిలర్ జాన్ వెస్లీ వెల్లడించారు. ఆకివీడు పట్నం ధర్మాపుర అగ్రహారంలో చర్చి సమస్య పై దళిత, క్రైస్తవ నాయకులు ఇటీవల నిరసన చేస్తూ స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు పై విమర్శలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దానిలో నిజం లేదంటూ ధర్మాపూర అగ్రహారం వార్డు కౌన్సిలర్ జాన్ వెస్లీ తెలిపారు. ఆక్రమణలో ఉన్నఇల్లు తొలగించిన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలు అందించామని, అక్కడకి వచ్చి ఏడుస్తున్న వారు కూడా పట్టాలు తీసుకున్న వాళ్లే అని అన్నారు. 2007 నుంచి మంచి నీటి చెరువు చుట్టూ ఆక్రమణల సమస్య వెంటాడుతోందని, ఆ క్రమంలోనే అక్కడ అక్రమంగా నిర్మాణం చేపడుతున్న చర్చి పై అనేక ఫిర్యాదులు పంచాయతీకి ఇవ్వడం జరిగిందని తెలిపారు.
2017లో హైకోర్టు ఆదేశాలు మేరకు అక్కడ ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలు వచ్చిన దానిని అతిక్రమించి చెరువు చుట్టూ వంటశాల, చర్చి నిర్మాణం ఇప్పుడు విమర్శిస్తున్న పాస్టర్ చేపట్టారని అన్నారు. రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యే అయిన తర్వాత వైసీపీ కౌన్సిలర్ ని అయినా.. కూడా వారి దగ్గరకు వెళ్తే స్పందించి న్యాయం చేశారని గ్రామ అభివృద్ధికి తోడ్పడ్డారని పేర్కొన్నారు. అటువంటి ఎమ్మెల్యే పై దుష్ప్రచారం చేయొద్దని, క్రైస్తవులుగా వీలైతే మా గ్రామ అభివృద్ధికి సహకరించాలని అన్నారు. మా గ్రామ అభివృద్ధిలో అన్ని మతాల, కులాల వారు సహాయం ఉందని, మా గ్రామంలో చర్చి నిర్మాణానికి కూడా ఇతర మతస్తులు సహకరించారని, అందరూ కలిసి మెలిసి ఉన్నామని, గ్రామంలో బయట నుంచి వచ్చినవారు తెలుసుకోకుండా క్రైస్తవుల మధ్యన విభేదాలు సృష్టిస్తున్నారని వివరణ ఇచ్చారు.
మా ఊర్లో మొదటి నుంచి ధర్మాపుర అగ్రహారం సంబంధించిన ఊరని ఇక్కడ శివాలయం ఎప్పటి నుంచో ఉందని శివాలయానికి పురావస్తు శాఖలో కూడా ఈ శివలింగం గురించి కాగితాలు ఉన్నాయని ఇటువంటి దాన్ని ఎందుకు తొలగించలేదు అన్న ప్రశ్న సరైంది కాదు అని అన్నారు. ఇక్కడ పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తి చర్చ లేదని ఊర్లో ఉన్న చర్చి మాత్రమే అసలైన చర్చని.. ఇతను కావాలనే ప్రతిసారి ఫిర్యాదులు చేస్తున్నాడని విమర్శించారు. తాను కూడా దళితుడినేనని బయట నుంచి వచ్చే పాస్టర్లని చెప్పుకునేవారు పూర్తిగా విషయాన్ని తెలుసుకున్నాక మాట్లాడితే బాగుండేదని తన కుటుంబాన్ని విమర్శలు చేసిన వారి విజ్ఞతకే విషయాన్ని వదిలేస్తున్నానని తెలిపారు.
