కోవర్టు రాజకీయాలు మానుకోవాలి…

కోవర్టు రాజకీయాలు మానుకోవాలి…
తొర్రూరు, ఆంధ్రప్రభ : కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేస్తున్న ఇరువురు కోర్టు రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు మహంకాళి సాయి మల్లు,మహంకాళి సంపత్ లు అన్నారు.కాంగ్రెస్ నాయకులపై పలువురి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం డివిజన్ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ లోనే ఉన్నామంటూ నటిస్తూ బీఆర్ఎస్ కు కోర్టులుగా పనిచేస్తూ ఓ వైపు పార్టీకి నష్టం చేస్తూ మరోవైపు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులను కలవడం సిగ్గుచేటన్నారు.
కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న కాకిరాల హరిప్రసాద్, కిషోర్ రెడ్డి లతోపాటు వారి అనుచరులను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి,టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిలను కోరారు.భూ దందాలు ,సెటిల్మెంట్లకు కేరాఫ్ గా నిలిచే వ్యక్తుల కింద చెంచాలుగా పనిచేస్తున్న మడిపల్లి సర్పంచ్ రామలింగం, మరికొందరు వారి బుద్ధి మార్చుకోవాలన్నారు.
దళిత,బహుజన బిడ్డలను ముందు పెట్టి రాజకీయంగా వారిని బలి పశువులను చేస్తున్నారని, కుట్రలు చేసేది మీరైతే వారిని బలి పశువులను చేయడం సరికాదన్నారు.ఇప్పటికైనా వారి వ్యవహారం మార్చుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ కార్యకర్తలు తగురీతిలో బుద్ధి చెప్తారన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు వేల్పుల వెంకన్న,చెడిపల్లి శీను, వేల్పుల జగదీష్, జస్వంత్, సుధాకర్, సిహెచ్ శ్రీను, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు.
