మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
జైనూర్, ఆంధ్రప్రభః కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మర్లవాయి రాయిసెంటర్ సర్ మేడి మాజీ ఎంపీటీసీ జుగ్నాక దేవ్ రావ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా అదే విధంగా సిర్పూర్( యు) మండలం పాములవాడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సోయం భుజంగారావు, నెట్నూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బొజ్జి రావు తమ్ముడు తెలంగ్ రావు అనారోగ్యంతో మృతి చెందగా ఈ విషయం తెలుసుకొని గురువారం రాత్రి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి వయాగ్రామలను సందర్శించి మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి సాంప్రదాయ నివాళులర్పించారు.
వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్ధించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పి మీకు అండగా ఎప్పుడు నేను ఉంటా అని ఎమ్మెల్యే కోవ లక్ష్మి భరోసా ఇచ్చారు .ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకురాలు సరస్వతి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాధవరావు, మాజీ సహకార చైర్మన్ కోడప హన్ను పటేల్, బిఆర్ఏస్ సిర్పూర్ (యు)మండల అధ్యక్షులు తోడసం ధర్మరావు,మాజీ సర్పంచ్ మడవి భీంరావు నాయకులు గేడం లక్ష్మ న్, గేడం మోహన్,జుగ్నాక ధర్మేందర్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
