శ్రీనివాసరెడ్డి కుటుంబానికి గండ్ర దంపతుల పరామర్శ,

శ్రీనివాసరెడ్డి కుటుంబానికి గండ్ర దంపతుల పరామర్శ,

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని, నవాబ్‌పేట గ్రామ గ్రామానికి చెందిన, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ కసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, భార్య కసిరెడ్డి రమ అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. దీంతో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ , భూపాలపల్లి జిల్లా బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి నవాబ్‌పేట గ్రామానికి చేరుకుని మృతురాలి పార్థివ దేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి,తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ సంఘటనతో గండ్ర జ్యోతి కన్నీటిపర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో చిట్యాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు అల్లం రవీందర్, గొర్రె సాగర్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, పిట్ట సురేష్, తవటం నవీన్, జంబుల తిరుపతి, పాండ్రాల వీరస్వామి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply