ఆలయాలు ఐక్యతకు కేంద్రబిందువులు

ఆలయాలు ఐక్యతకు కేంద్రబిందువులు
శతాబ్దాల చరిత్రకు ప్రతీక వాసవి అమ్మవారి ఆలయం
దేవాలయాల పునర్ నిర్మాణం మన సంస్కృతి..
సనాతన ధర్మ పరిరక్షణకు బలాన్నిస్తుంది.
అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, ఆంధ్రప్రభ: ఆలయాలు సమాజ ఐక్యతకు కేంద్రబిందువులని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. వాసవి అమ్మ వారి ఆలయం శతాబ్దాల చరిత్రకు ప్రతీక అని ఇలాంటి పురాతన దేవాలయాల పునర్నిర్మాణం మన సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు బలాన్నిస్తుందన్నారు. సికింద్రాబాద్ జనరల్ బజార్ ప్రాంతంలో సుమా రు 400 సంవత్స రాల చరిత్ర కలిగిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ పునఃనిర్మాణ, విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా ముఖ్యాతిథులుగా హాజరయ్యారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. పునఃనిర్మాణం అనంతరం ఆలయం మరింత వైభవంగా, శోభా యమానంగా దర్శనమిస్తోంది. భక్తుల సమక్షంలో జరిగిన ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.
అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌఖ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
