ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి….

ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలి….

బిక్కనూర్, ఆంధ్ర ప్రభః ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సూచించారు. హైదరాబాదు నుండి ఆర్మూర్ వెళ్తూ మండల పరిధిలోని జంగంపల్లి వద్ద ఆగారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు.

వాటికి అరులైన వారికి అందే విధంగా చూడవలసిన బాధ్యత పార్టీ నాయకులు కార్యకర్తలపై ఎంతైనా ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంకం రాజు, శ్యాంసుందర్ రెడ్డి ఉన్నారు.

Leave a Reply