Mla | శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

Mla | శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

Mla | గణపురం, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్దారం గ్రామంలోని శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు పద్మ దంపతులు పాల్గొని భక్తిశ్రద్ధలతో కళ్యాణ క్రతవు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు నిర్వహించి రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, నియోజకవర్గ అభివృద్ధి, సర్వాంగ సౌభాగ్యాల కోసం ప్రార్థనలు చేశారు.


అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవాలయాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా నిలిచి సమాజంలో సత్సంస్కారాలు పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply