MLA | రైతు పక్షపాతి మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి

MLA | రైతు పక్షపాతి మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి

  • మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి మరణం
  • థని రాజకీయానికి తీరని లోటు

MLA | మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : మంథని మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి మరణం మంథని రాజకీయానికి తీరని లోటని, మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి రైతు పక్షపాతి వ్యక్తిని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి పార్థివదేహానీకి మంత్రి శ్రీధర్ బాబు నివాళులర్పించారు.

మంథని పట్టణం కూరగాయల మార్కెట్ సమీపంలోని రాంరెడ్డి కాంప్లెక్స్ తీసుకువచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి పార్థివదేహాన్నీ మంత్రి శ్రీధర్ బాబు సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. రాంరెడ్డి గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవ చేశారనీ.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఆయనను కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమని తెలిపారు. మంథని నియోజకవర్గానికి ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. ఆయన రాజకీయ జ్ఞానం నేటి తరానికి మార్గదర్శకమని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిటీ సభ్యులు, టీపీసీసీ ఎన్నికల కోఆర్డినేషన్ సభ్యులు, న్యాయవాది శశిభూషణ్ కాచే, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు తోట్ల తిరుపతి, మాజీ ఎంపీపీ కొండ శంకర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్, తదితరులు ఉన్నారు.

Leave a Reply