MLA | క్రీడా పోటీలు అవసరం..

MLA | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయలుకు చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యం అని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి(Kotla Jaya Suryaprakash Reddy) పేర్కొన్నారు. మంగళవారం నంద్యాల జిల్లాలోని బేతంచర్ల మండలంలోని సిమెంట్ నగర్ గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయుల క్రీడా ఎంపికల్లో ముఖ్య అతిథిగా డోన్ ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ఉపాధ్యాయులు విద్యా రంగంతో పాటు క్రీడల్లో చురుకుగా పాల్గొనడం అభినందనీయం అన్నారు. శారీరక దారుఢ్యం, జట్టు స్పూర్తి, క్రీడాస్ఫూర్తి వంటి విలువలు ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థుల్లో రూపుదిద్దుకుంటాయన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం ఇలాంటి క్రీడా కార్యక్రమాలను మరింత విస్తృతంగా(More broadly) నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Leave a Reply