కర్లీ హెయిర్ క్యూట్ బ్యూటీ మిథిలా పాల్కర్ ఓరి దేవుడా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టేసింది. ఇక తాజాగా మిథిలా ఓహో ఎంతన్ బేబీ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రం ఈ నెల 11న రిలీజైంది. అయితే ఈ సినిమాకు అనుకున్నంత స్పందన రాలేదు. కానీ ఇందులో మిథిల లిప్ లాక్ సీన్ లో నటించింది. ఆ కిస్ సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మిథిల ఈ సినిమాలో మీరా పాత్రలో కనిపించింది. ఇందులో హీరో అశ్విన్- మీర మధ్య బ్రేకప్ సన్నివేశం ఉంది. ఆ సమయంలో అశ్విన్ కంట్రోల్ తప్పి మీరను లిప్ లాక్ చేస్తాడు. ఈ సీన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే ఈమె గతంలో తెలుగు, హిందీ సినిమాల్లో నటించినప్పకీ ఇలా బోల్డ్ సీన్స్లో కనిపించే దైర్యం చేయలేదు. ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాల్లో ఇంటిమేషన్ సీన్స్, బోల్డ్ సన్నివేశాలు లేవు. కానీ మిథిల ఈ సినిమా కోసం హద్దులు చెరిపేసి కిస్ సీన్ లో నటించడంతో ఆభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఆమెలోని ఈ కొత్త కోణం చూసి షాక్ అవుతున్నారు. అందుకే ఈ లిప్ లాక్ క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే ఈ లిప్ లాక్ కేవలం ఒక చిన్న ముద్దు సన్నివేశమే కాదు.ఈ సీన్ స్టోరీలో ఓ టర్నింగ్ పాయింట్. ఏది ఏమైనప్పటికీ ముద్దు సీన్ ను చూసి కొంతమంది ఆశ్చర్యపోతే, మరి కొందరు మూవీ లవర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
