Mission Ax-4 | అంత‌రిక్ష కేంద్రానికి భార‌త వ్యోమగామి..

భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్, వ్యోమగామి శుభాన్షు శుక్లా మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. దీంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామిగా చరిత్ర సృష్టించనున్నారు.

ఆక్సియమ్ మిషన్ 4 (ఏఎక్స్ – 4)లో భాగంగా మే 29న రాత్రి 10:33 గంటలకు ఫ్లోరిడా నుంచి స్పేస్‌ఎక్స్ డ్రాగన్ స్పేస్ షిప్ అంతరిక్షంలోకి దూసుకెళ్ల‌నుంది.

ఈ మిషన్‌ను ఇస్రో, నాసా, స్పేస్‌ఎక్స్, ఆక్సియమ్ స్పేస్ సంయుక్తంగా చేపడుతున్నాయి. కాగా, భారతదేశ అంతరిక్ష ఆశయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడంలో ఈ మిష‌న్ కీలకమైన అడుగు కానుంది.

నాసాకు చెందిన అనుభవజ్ఞుడైన వ్యోమగామి పెగ్గీ విట్సన్ నేతృత్వంలోని Ax-4 మిషన్‌లో పోలాండ్, హంగేరీకి చెందిన వ్యోమగాములతో క‌లిసి శుక్లా అంత‌రిక్షంలోకి వెళ్ల‌నున్నాడు.

అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్ లో వారు 14 రోజుల పాటు గ‌డ‌ప‌నున్నారు. ఈ మిష‌న్ లో భాగంగా గగన్యాన్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌కు కీలకమైన సైనోబాక్టీరియాను పరీక్షించడం వంటి శాస్త్రీయ ప్రయోగాలలో పాల్గొంటారు.

Leave a Reply