సర్పంచ్ చొరవతో తీరిన భగీరథ లీకేజీల సమస్య..

సర్పంచ్ చొరవతో తీరిన భగీరథ లీకేజీల సమస్య..
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలంలోని దేవన్ పల్లి గ్రామంలో సర్పంచ్ లకావత్ శేఖర్, ఉపసర్పంచ్ సాయిలు చొరవతో మిషన్ భగీరథ లీకేజీల సమస్య తీరింది. గ్రామ పరిధిలోని వడ్డెర కాలనీలో గత రెండు మూడు సంవత్సరాల నుండి మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీలతో తాగునీటి సమస్య ఏర్పడింది.తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని మిషన్ భగీరథ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది.
అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా గెలిచిన లకవత్ శేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మిషన్ భగీరథ అధికారులను కోరగా లీకేజ్ సమస్య ను గ్రామపంచాయతీ పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో సర్పంచ్ గురువారం భగీరథ పైప్‌లైన్ లీకేజీలకు మరమ్మతు పనులు చేపట్టారు.లీకేజీల సమస్య తీరడంతో వడ్డెర కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

