న్యూ ఢిల్లీ – పహల్గాం ఘాతుకానికి పాల్పడిన పాక్‌కు భారత్.. ఆపరేషన్ సిందూర్‌తో గట్టి షాకిచ్చింది. అర్ధరాత్రి మిసైల్ దాడులతో పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలను తుత్తునీయలు చేసింది. అత్యంత కచ్చితత్వంతో ఈ దాడులు చేసేందుకు భారత్ హామర్, స్కాల్ప్ మిసైళ్లను కూడా వాడినట్టు తెలుస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ కలిగిన ఈ దీర్ఘశ్రేణి మిసైల్స్‌తో శత్రుమూకలకు చెందిన అత్యంత పటిష్ఠమైన నిర్మాణాలను కూడా కూల్చి వేయొచ్చు.
ఏమిటీ స్కాల్ప్ మిసైల్
ఫైటర్ విమానాల నుంచి ప్రయోగించ గలిగే ఇవి దీర్ఘ శ్రేణి క్రూయిజ్ మిసైల్స్. ఇవి 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులువుగా ఛేదించగలవు. ఈ మిసైల్స్‌కు చెందిన కొన్ని వర్షెన్లు 560 కిలోమీటర్ల లక్ష్యాన్ని కూడా ఛేదించగలవు. శత్రుదేశపు కమాండ్ సెంటర్లు, విమానిక స్థావరాలు, బంకర్ల వంటి భద్రతమైన నిర్మాణాలను కూడా ఈ మిసైల్స్ ధ్వంసం చేస్తాయి. వీటిల్లోని ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థ, టెర్రెయిన్ ఫాలోయింగ్ రాడార్, ఇన్‌ఫ్రారెడ్ టర్మినల్ హోమింగ్ వంటి వ్యవస్థల కారణంగా ఇవి అత్యంత కచ్చితత్వంతో తమ లక్ష్యాలను ఛేదింజగలుగుతాయి. వీటితో 450 కిలోల సంప్రదాయిక వార్ హెడ్స్‌ను మోసుకెళ్లగలదు. సిందూర్ ఆపరేషన్‌లో రఫేల్ విమానాల ద్వారా వీటిని ప్రయోగించినట్టు తెలుస్తోంది.
హామర్ మిసైల్స్
యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే ఈ మిసైల్స్ 50 నుంచి 70 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలవు. బంకర్లు, బహుళ అంతస్తుల భవనాలను ధ్వంసం చేసేందుకు వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇన్‌ఫ్రారెడ్, లేజర్ గైడెన్స్ ఉన్న కారణంగా వీటికి వివిధ రకాల లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉంది. రఫేల్, తేజస్ యుద్ధ విమానాల ద్వారా వీటిని ప్రయోగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
శత్రుదేశ దాడులతో యుద్ధ విమానాలకు అపాయం లేకుండా కామెకాజీ డ్రోన్స్‌తో దాడులు చేస్తారు. స్వతంత్రతో పనిచేసే ఈ డ్రోన్లు ఎంపిక చేసిన లక్ష్యాలపై ఎగురుతూ దాడులు చేస్తాయి. ముఖ్యమైన లక్ష్యాలను ధ్వంసం చేసేందుుకు వీటిని వినియోగిస్తారని నిపుణులు చెబుతున్నారు..
స్కాల్ప్ క్షిపణి …
రేంజ్ – 500 కి.మీ.లు
బరువు – 1300 కిలోలు
శక్తి – భూమి లోపల 10 అంతస్తుల వరకూ చొచ్చుకుపోవడం
పేలుడు – బంకర్ అడుగుకు చేరిన తర్వాత ఒక్కసారిగా పేలిపోవడం
ఫలితం – భూమి లోపల పేలిన చోటు నుంచి భూ ఉపరితలం వరకూ కట్టడాలు కుప్పకూలుడే
గైడెడ్ మిస్ఫెల్ – ముందుగా సెట్ చేసిన విధంగా కచ్చితత్వంతో పయనిస్తుంది. పక్కనున్న బిల్డింగ్లకు ఎటువంటి హాని జరగదు. ఒక కాలనీలో గుర్తుపట్టిన ఇంటి పైనుంచి భూమిలోపలికి చొచ్చుకుపోయి పేలుతుంది. తయారీ – ఐరోపాకు చెందిన ఎంబీడీఏ కంపెనీ
మిస్ఫెల్ మరోపేరు – స్టార్మ్ షాడో
ప్రయోగం – సుఖోయ్, మిగ్ 29, రాఫెల్, మిరేజ్,
హామర్ క్షపణి రేంజ్ – 50 కి.మీ.లు.. ఎయిర్ టు గ్రౌండ్ మిస్ఫెల్ .. ఫ్రెంచ్ కంపెనీ సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ తయారీ
జీపీఎస్, లాజర్ గైడెన్స్తో కచ్చితత్వంతో లక్ష్యం వైపు దూసుకుపోతుంది భూమిలోపల బంకర్లను సర్వనాశనం చేస్తుంది.
కామికోజ్ డ్రోన్ – మారుపేరు సూసైడ్ డ్రోన్.. టార్గెట్ను కచ్చితత్వంతో ఛేదించడం.. మానవ రహిత వాహనం గైడెడ్ మిస్ఫైల్స్ను మోసుకుపోతుంది. సొంతంగా ఎక్కడికక్కడ రూట్ మార్చుకుంటుంది. సమీపించిన తర్వాత టార్గెట్లో స్వల్ప మార్పులను కూడా గుర్తిస్తుంది. ఆ తర్వాతే మిస్సెల్స్న ప్రయోగిస్తుంది. చివరగా టార్గెట్ను డీకొని సర్వనాశనం చేస్తుంది