ఫ‌స్ట్‌డే క‌లెక్ష‌న్ ఎంతంటే..?

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : తేజా స‌జ్జ హీరోగా న‌టించిన మిరాయ్ (Mirai) చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. గ‌త ఏడాది హనుమాన్ (Hanuman)తో మంచి విజ‌యం సాధించిన తేజా.. రెండో సినిమాగా వ‌చ్చిన మిరాయ్ సెప్టెంబ‌ర్ 12 (శుక్ర‌వారం) విడుద‌లై క‌లెక్ష‌న్ల ప‌రంగా దూసుకుపోతోంది. ఫాంట‌సీ మూవీ (fantasy movie)గా వ‌చ్చిన ఈ సినిమా తొలిరోజు అన్ని భాష‌ల్లో క‌లిపి రూ.12కోట్లు వ‌సూలు చేసింది. తేజా మొద‌టి సినిమా (Teja’s First Movie) హ‌నుమాన్ తొలిరోజు రూ.8కోట్లు వ‌సూలు చేయ‌గా, అత‌ని రెండో సినిమా మిరాయ్ దానిని అధిగ‌మించింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో వీకెండ్‌లో క‌లెక్ష‌న్లు (Weekend Collections) మరింత పెరిగే అవ‌కాశం ఉంది.

క‌లెక్ష‌న్లు ఇలా..
‘మిరాయ్ సినిమాకు తెలుగులో మొదటి రోజు రూ. 10.60 కోట్ల నెట్ కలెక్షన్ రాగా. హిందీలో రూ.1.25 కోట్లు, తమిళంలో రూ.5 లక్షలు, మలయాళంలో రూ.5 లక్షలు, కన్నడలో రూ.5 లక్షలు వచ్చాయి. దాంతో టోటల్ నెట్ కలెక్షన్ రూ. 12 కోట్లు అయ్యింది.

Leave a Reply