చింతా వెంటేశ్వరరావు మృతి టీడీపీకు తీరని లోటు

చింతా వెంటేశ్వరరావు మృతి టీడీపీకు తీరని లోటు

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు, పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ చింతా వెంకటేశ్వరరావు (బుల్లి) ఆకస్మిక మృతి విచారకరమని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ (చిన్ని) పేర్కొన్నారు.

చింతా వెంకటేశ్వరరావు మృతి పార్టీకి తీరని లోటు అని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎంపీ చిన్ని పేర్కొన్నారు. అంకితభావంతో పార్టీ అభ్యున్నతి కోసం పనిచేసిన నాయకుడనీ, గ్రామాభివృద్ధికి, పార్టీ బలోపేతానికి వెంకటేశ్వరరావు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పలువురు నేతల నివాళి..

నవాబుపేట గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకులు, పిఎసిఎస్ అధ్యక్షులు చింతా వెంకటేశ్వరావు (బుల్లి) భౌతిక కాయాన్ని ఆయన నివాసంలో పలువురు నాయకులు సందర్శించి నివాళులు అర్పించారు. ఎంపీ కేశినేని శివనాద్ (చిన్ని) ఆదేశానుసారం వెంకటేశ్వరరావు భౌతిక కాయాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బొప్పన భవకుమార్, టిడిపి మైనార్టీ సెల్ రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, రాష్ట్ర నాగవంశ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు సొంగా సంజయ్ వర్మ, టిఎన్టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్, గంపలగూడెం మండల పార్టీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ తదితరులు ఘన నివాళులు అర్పించి, వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకటేశ్వరరావు అంతిమయాత్రలో సైతం పాల్గొని నివాళులు అర్పించారు.

Leave a Reply