నవీన్ యాదవ్ కు మద్దతుగా…

ప్రచార కార్యక్రమంలో పాల్గోన్న విజయారెడ్డి
జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఖైరతాబాద్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్ విజయ రెడ్డి నవీన్ యాదవ్ తో కలసి ప్రచారం చేపట్టారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గం, ఎర్రగడ్డ డివిజన్ లో గల ఆనంద్ నగర్, బంజారా నగర్, ప్రేమ్ నగర్, ఓల్డ్ సుల్తాన్ నగర్, జామియా మజిద్, నూర్ మజీద్, న్యూ సుల్తాన్ నగర్, నేతాజీ నగర్, రాజీవ్ నగర్ పార్క్ లలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ రాములు నాయక్ లతో కలసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply