సీఎం కు మంత్రి వాకిటి శ్రీహ‌రి బ‌ర్త్ డే విషెస్

సీఎం కు మంత్రి వాకిటి శ్రీహ‌రి బ‌ర్త్ డే విషెస్

మక్తల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో రేవంత్ రెడ్డిని కలిసి మక్తల్ ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Dr.Vakiti Srihari) శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్ర అభివృద్ధి పట్ల దృఢ సంకల్పంతో, నిరంతరం ప్రజల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (Revanth Reddy) కి జన్మదినం సందర్భంగా మరింత శక్తిని ఇవ్వాలని ఏడుకొండల వాడిని కోరుకుంటున్నట్లు మంత్రి శ్రీహరి తెలిపారు. మంత్రి వెంబడి మక్తల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పూజ శివరాజ్, చెన్నయ్య సాగర్, తదితరులు ఉన్నారు.

Leave a Reply