మక్తల్, ఆంధ్రప్రభ : అత్యవసర సమయంలో విద్యుత్ సమస్యలు సత్వరమే పరిష్కరించేందుకు టీజీఎస్‌పీడీసీఎల్(TGSPDCL) కేటాయించిన ఎలక్రికల్ అంబులెన్స్‌ను రాష్ట్ర పశుసంవర్థక శాఖ, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనం ‘కీ’ ని ఏడీఈకి ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు విద్యుత్ పరంగా సత్వర సేవలు అందించేందుకు ఎమర్జెన్సీ వాహనం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ సిబ్బంది వెంటనే స్పందించేలా ఈ వాహనం ఉపయోగపడుతుందని అన్నారు.
ప్రభుత్వం(government) ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ శాఖ(Power Department)లో ఆధునిక సదుపాయాలు(facilities) కల్పిస్తుందని చెనప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఈ సౌకర్యాన్నిసద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, త్వరితగతిన విద్యుత్ సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటి(Electricity) ఏడిఈ జగన్మోహన్ చారి(Jaganmohan Chari), ఏఈ రామకృష్ణ, బి కే ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి ,మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, మాజీ జెడ్పీటీసీ జి. లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, కాంగ్రెస్ నాయకులు కట్ట సురేష్ కుమార్, చెన్నయ్య గౌడ్ , విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

