మక్తల్ అభివృద్ధికి అండగా నిలవండి..

మక్తల్ అభివృద్ధికి అండగా నిలవండి..

  • ఎన్నికల ప్రచారంలో మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ పట్టణ ప్రజలు అభివృద్ధికి అండగా నిలవాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం 15వ వార్డు పరిధిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోళ్ళ సంధ్యా వెంకటేష్ కు మద్దతుగా ఆయన ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా గత కొంతకాలంగా నిస్వార్థంగా పనిచేస్తున్న కోళ్ళ వెంకటేష్ కుటుంబానికి ఈ ప్రాంత ప్రజలు అండగా నిలవాలని కోరారు.మక్తల్ పట్టణం అభివృద్ధి జరగాలంటే మునిసిపాలిటీలోనూ కాంగ్రెస్ పార్టీకి అధికారమివ్వాలని ఆయన ప్రజలకు విన్నవించారు .ఇతరుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.

ప్రతిపక్ష పార్టీల వల్ల ఏమీ సాధ్యం కాదని అభివృద్ధి అధికార పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. ఇప్పటికే వందల కోట్ల రూపాయల వ్యయంతో పట్టణంలో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. మరింత అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు .15వ వార్డు అభ్యర్థి కోళ్ళ సంధ్యా వెంకటేష్ కు 11న జరగనున్న ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా మిగతా వార్డులలోను కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు .ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జి. లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కోళ్ళ వెంకటేష్ పలువురు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply