బాధిత కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ

మంథని, ఆంధ్రప్రభ : తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. శుక్రవారం మంథని మున్సిపల్ పరిధిలోని గంగపురిలో ఇటీవల మృతి చెందిన బత్తుల సత్యనారాయణ కుటుంబాన్ని మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు.

సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట స్థానిక కౌన్సిలర్ స్రవంతి రమేష్ బాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న, మండల పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు, న్యాయవాది శశిభూషణ్ కాచే, నాయకులు రమేష్ బాబు, శ్రీపతి బానయ్య, జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరేళ్ళి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply