Minister Seethakka | చిన్నబోయినపల్లిలో మంత్రి సీతక్క ప్రచారం..
Minister Seethakka | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామంలో ఈ రోజు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చేల వినయ్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్థులను కోరారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామ సమస్యల పరిష్కారానికి, పారదర్శకమైన అభివృద్ధి(Development)కి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామానికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.

