Seethakka | మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం..

Seethakka | మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం..
Seethakka | ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : ఇందిర మహిళా శక్తి పథకం (Indira Mahila Shakti Scheme) కింద మహిళా సంఘం సభ్యులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Seethakka) చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క (Seethakka) మాట్లాడుతూ… ముందుగా 65లక్షల మంది మహిళలు మాత్రమే సంఘాల్లో ఉన్నారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
ఆనాడు మహిళలు (Womens) వంటింటికి మాత్రమే పరిమితం అయ్యేవారని, నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. వారితో కలెక్టర్ దివాకర్ టిఎస్, అడిషనల్ కలెక్టర్ సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాను రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
