TG | బీసీ సంఘాలతో మంత్రి పోన్న‌ భేటీ

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేలో వ్యక్తమైన సందేహాల నివృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా శనివారం రాష్ట్ర సచివాలయంలో బీసీ సంఘాలు, బీసీ మేధావులతో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించారు. కుల గణన నివేదికపై బీసీ సంఘాలు, బీసీ మేధావులతో మంత్రి చర్చిస్తున్నారు.

ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, బీసీ కమిషన్‌ సభ్యులు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య, బీసీ సంఘం నాయకుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ వకుళా భరణం కృష్ణమోహన్‌రావు, మాజీ ఐఏఎస్‌ చిరంజీవులు, పలువురు బీసీ సంఘం నాయకులు, ప్రొఫెసర్లు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, తదితరులు హాజరయ్యారు.

Leave a Reply