అధికారుల‌ను ఆదేశించిన మంత్రి పొన్నం

అధికారుల‌ను ఆదేశించిన మంత్రి పొన్నం

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను ప్రభావం తో కురుస్తున్న భారీ వర్షాలతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , అలాగే అధికారులు కూడా ఎప్ప‌టిక‌ప్పుడు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సూచించారు. అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రావద్దని ఎక్కడ ఇబ్బందులు ఉన్న అధికారుల దృష్టికీ తీసుకోవాలని తెలిపారు.

జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఎ, వాటర్ వర్క్, పోలీస్, విద్యుత్, హైడ్రా(Police, Electricity, Hydra) అధికారులు సమన్వయం చేసుకోవాలని ఫిర్యాదు వస్తె వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద నీరు నిల్వ ఉండకుండా సిబ్బంది ఉండేలా జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

వర్షాలు కురుస్తున్నప్పుడు విద్యుత్ స్థంబాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. “మొంథా” తుఫాను ప్రభావం తగ్గే వరకు అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Leave a Reply