AP | రేపు ఢిల్లీకి మంత్రి నారా లోకేష్..
- కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ రేపు సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రేపు సాయంత్రం 5.45 గంటలకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం కానున్నారు. ఈక్రమంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై అశ్విని వైష్ణవ్ చర్చించనున్నారు. కాగా, రైల్వే బడ్జెట్ లో ఏపీకి భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో లోకేష్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
లోకేష్ రేపు రైల్వే మంత్రితో పాటు మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశముంది. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురిం చిఆయన ఈ సమావేశాల్లో ప్రస్తావించనున్నారు. ఇందుకోసం కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ ను కూడా టీడీపీ ఎంపీలు ముందుగానే తీసుకున్నట్లు సమాచారం. అనంతరం రాత్రి 9 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.