Market | మంత్రి నాదెండ్లతో ఘంటా పద్మశ్రీ ప్రసాద్
Market | ఏలూరు బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల కురిసిన వర్షాలు కారణంగా పాడైన రోడ్ల మరమ్మత్తుల నిమిత్తం 4వేల 2వందల కోట్లు నిధులు విడుదల చేయాలంటూ వినతి పత్రాన్ని అందజేసిన చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ (Ghanta Padma Shri Prasad) స్థానిక రెవెన్యూ అదితి భవన్‌లో జిల్లా ఇంచార్జ్ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసి, ఇటీవలి భారీ వర్షాలు మరియు తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల పరిస్థితిపై వివరించారు. జిల్లా పరిధిలోని అనేక ముఖ్య రహదారులు పూర్తిగా దెబ్బతిని, ప్రజా రవాణా కోసం అత్యంత ప్రమాదకరంగా మారిన విషయాన్ని తెలియజేశారు.
ఈ రహదారులు మండల కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లు (Agricultural markets) పరిశ్రమ ప్రాంతాలు మరియు గ్రామీణ నివాసాలను అనుసంధానించే కీలక మార్గాలు కావడంతో ప్రజలకు భారీ ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వివరించారు. తక్షణమే మరమ్మతులు చేపట్టకపోతే రహదారులు మరింత దెబ్బతిని, భవిష్యత్తులో అత్యధిక వ్యయం అవసరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని చైర్‌పర్సన్ మంత్రి కి వివరించారు. ఈ నేపథ్యంలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో అత్యవసర రహదారి మరమ్మతు పనులను పంచాయితీ రాజ్ (జిల్లా పరిషత్ ) రహదారులకు రూ.1183.44 లక్షలు మరియు ఆల్&బి రహదారులకు రూ. 3023.00 లక్షలు మొత్తం రూ. 4206.44 లక్షల నిధులను ప్రభుత్వం ఆమోదించి విడుదల చేయవలసిందిగా చైర్‌పర్సన్ మంత్రి కి వినతి పత్రం ఇచ్చారు. మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయాన్ని వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీప్రసాద్ తెలిపారు.

