Minister Lokesh Sudden Visit : హెచ్ ఎం సస్పెన్షన్ Andhra Prabha News

Minister Lokesh Sudden Visit : హెచ్ ఎం సస్పెన్షన్ Andhra Prabha News
వంట ఏజెన్సీ రద్దు
మైలవరంలో మంత్రి లోకేష్ అకస్మిక తనిఖీ
మధ్యాహ్నం భోజనం నాణ్యతపై ఫిర్యాదు
ఆంధ్రప్రభ, మైలవరం (ఎన్టీఆర్ జిల్లా)

Minister Lokesh Sudden Visit : ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. మూడు దశాబ్ధాల కిందట ఒకే ఓక్కడు సినిమాను … ప్రత్యక్షంగా మైలవరం ప్రజలకు చూపించారు. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం మండలంలోని తారక రామా నగర్ ప్రాథమిక పాఠశాలలో మిడ్‌డే మీల్స్ నాణ్యతపై ఫిర్యాదుల నేపథ్యంలో ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఇటీవల విద్యార్థులు భోజనంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన విషయం ఆయన దృష్టికి రావడంతో తక్షణమే స్పందించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులకు క్షమాపణలు తెలుపుతూ లోకేశ్ సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. ఘటనపై బాధ్యత వహిస్తూ పాఠశాల హెడ్‌మాస్టర్‌ను సస్పెండ్ చేసినట్లు, వంట బాధ్యతలు నిర్వహిస్తున్న ఏజెన్సీ నిర్వాహకులను తొలగించినట్లు వెల్లడించారు. తనిఖీ సమయంలో పాఠశాలలో భోజన ఏర్పాట్లు, పరిశుభ్రత, విద్యార్థుల పరిస్థితిని స్వయంగా పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారులకు కఠిన సూచనలు జారీ చేసినట్లు సమాచారం.
Minister Lokesh Sudden Visit 30 ఏళ్ల కిందట సీఎం బాబు ఇంతే..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అకస్మిక తనిఖీలను ఈ రోజు మంత్రి లోకేష్ గుర్తు చేశారు. కనీసం కమిషనర్ స్థాయి అధికారికి కూడా సమాచారం లేకుండా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అకస్మికంగా కార్యాలయాలను తనిఖీ చేసి.. విధులకు దూరంగా ఉండే సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకుని చరిత్ర సృష్గించారు. సరీగా 31 ఏళ్ల కిందట ఈ ఘటనలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ. గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఆకస్మిక తనిఖీలను మంత్రి లోకేశ్ గుర్తుచేశారు. ప్రజా సేవల్లో నిర్లక్ష్యం అస్సలు సహించబోమని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక మంత్రి తనిఖీ సందర్భంగా మీడియా ప్రతినిధులను లోపలికి అనుమతించకపోవడం వివాదాస్పదంగా మారింది.
ALSO READ : 45crore Release : అన్ని మతాలను గౌరవిస్తా Andhra Prabha News
