రెడ్‌బుక్‌లో చాలా ఉన్నాయ్..

ఆంధ్రప్రదేశ్ వెబ్ డెస్క్: విద్యాశాఖ, ఐటీ మంత్రి నారా లోకేష్(IT Minister Nara Lokesh) సంచలన వాఖ్యలు చేశారు. టీడీపీ పార్టీ ఆఫీసంటే అది కార్యకర్తల కార్యాలయమే అన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu)ని కలవాలంటే అప్పాయింట్‌మెంట్ అవసరంకానీ.. పార్టీ ఆఫీసుకు ఎవరు ఎప్పుడొచ్చినా అందుబాటులో ఉండి ఫిర్యాదులు తీసుకుంటామని వెల్లడించారు. ఢిల్లీ(Delhi) బీజేపీ ఆఫీసు కన్నా టీడీపీ ఆఫీస్ పెద్దగా ఉందన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ NDA అభ్యర్థికి ఎందుకు ఓటేసిందో వైఎస్ జగన్(YS Jagan)నే అడగాలన్నారు. 2029 ఎన్నికల్లో కూడా మోదీకే తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. అలాగే తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్(Former Minister KTR)ని కూడా కలుస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అక్కను కవితను టీడీపీలో తీసుకోవడమంటే.. జగన్‌ని పార్టీలో చేర్చుకోవడమేనని పేర్కొన్నారు.
తాను 2024 ఎన్నికలకు ముందు అక్రమార్కులకు ‘రెడ్ బుక్'(‘Red Book’)తో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రెడ్‌బుక్‌లో చాలా ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా బయటికి తీసుకొస్తానన్నారు. వైసీపీ నేతలెవరూ అవినీతి జరగలేదని చెప్పడం లేదు. దొరికిపోతానన్న భయంతోనే మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్. జగన్ బెంగుళూరులో ఉన్నారన్నారు.
తెలంగాణ(Telangana)పై టీడీపీ ఫోకస్ చేస్తోందని.. త్వరలో పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికల్లో పోటీపై పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారన్నారని చెప్పారు. సంక్షేమ పథకాలను బూత్ స్థాయికి తీసుకెళ్లాలని ప్రధాని సూచించారన్నారు. స్వదేశీ వస్తువులను ప్రమోట్ చేయాలని ప్రధాని చెప్పినట్లు లోకేష్ తెలిపారు.
