అన్ని సదుపాయాలు కల్పిస్తాం..

( ఆంధ్రప్రభ, లండన్ ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)తో చేతులు కలిపితే, అది మీ ప్రాజెక్ట్ కాదు, ఏపీ ప్రాజెక్ట్ అవుతుంది!” అని ఏపీ ఐటీ మంత్రి లోకేశ్(IT Minister Lokesh) అన్నారు. ఇప్పటికే 10 లక్షల కోట్ల ప్రాజెక్టులు అనుమతించామని, ఏడాదిలోనే పెట్టుబడులు రెట్టింపు అయ్యాయన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII ) లండన్ లో ఈ రోజు బుధవారం (17.09.25న) ఆంధ్రప్రదేశ్ -యూకే బిజినెస్ ఫోరం నిర్వహించిన పెట్టుబడుల రోడ్‌షోలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. విజయవాడ(Vijayawada)లో నవంబర్ 14-, 15 తేదీల్లో జరిగే CII పార్ట్‌నర్‌ షిప్ సమ్మిట్-2025 కు ముందుగా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈ కార్యక్రమం చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో అధునాతన తయారీ (అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్), గ్రీన్ ఎనర్జీ(Green Energy), డిజిటల్ ఇన్నోవేషన్, పోర్ట్‌ల ఆధారిత పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించడం. పెట్టుబడిదారులకు స్థిరమైన వ్యాపార పరిస్థితులు, వేగవంత అనుమతులు (ఫాస్ట్ అప్రూవల్స్), లక్ష ఎకరాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు అవకాశాలను మంత్రి లోకేశ్ వివరించారు.

ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా ప్రతినిధి ఎరిక్‌సన్, ఇవాంటే గ్లోబల్ ప్రతినిధి సైయెంట్, AI ఓపెన్‌సెక్, లండన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(London Chamber of Commerce and Industry), హిందూజా గ్రూప్, రోల్స్-రాయిస్, టెక్ మహీంద్రా యూరప్, UK డిప్యూటీ హై కమిషనర్ సుజిత్ ఘోష్ పెట్టుబడిదారులు, CEOలు, పాలసీమేకర్లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యువగళం పాదయాత్ర గురించి వివరించారు

Leave a Reply