AP | కొడికొండ చెక్ పోస్ట్ వద్ద మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మిక తనిఖీలు

చిలమత్తూరు, ఆంధ్రప్రభ : చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్‌లోని మాధనిషేధ & ఎక్సైజ్ చెక్‌పోస్ట్‌ను ఎక్సైజ్, గనులు, భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరుపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

వాహన తనిఖీలో మానవ తప్పిదాలను తగ్గించడానికి యంత్రాల వినియోగాన్ని పరిశీలించాలని ఆయన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, సబ్-ఇన్‌స్పెక్టర్, ఇతర సిబ్బందిని ఆదేశించారు. ఈ చర్య తనిఖీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరుపై ఆరా తీసి, వారి నిబద్ధత పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ తనిఖీలో మంత్రి రవీంద్రతో పాటు ఆయన ఓఎస్‌డి కె.ఎల్. గోపాల్, అనంతపురం మధ్యనిషేధం & ఎక్సైజ్ ఉప కమిషనర్ పి. నాగమద్దయ్య, శ్రీ సత్యసాయి జిల్లా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. నరసింహులు, చెక్ పోస్ట్ సీఐ శ్రీధర్, ఎస్.ఐ. విజయ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply