Minister | అవకాశం కల్పించండి అభివృద్ధి చేసి చూపిస్తా

Minister | అవకాశం కల్పించండి అభివృద్ధి చేసి చూపిస్తా

Minister | మక్తల్, ఆంధ్రప్రభ : కర్ని పంచాయతి ప్రజలు ఓటువేసి ఆదరించి గెలిపిస్తే సంపూర్ణ అభివృద్ధి గ్రామంగా అన్ని రంగాల్లోని అభివృద్ధి(Development) చేస్తానని కాంగ్రెస్ మద్దతుతో మక్తల్ మండలంలోని కర్ని సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి దండు దత్తురాం అన్నారు. మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.

అభివృద్ధి అంటే మాటలు కాదు, చేతుల్లో చూపిస్తానని, ఆశతో రాలేదని, మంచి దృఢ సంకల్పంతో అభివృద్ధి చేయాలనే ఆశతో వచ్చానని అన్నారు. మీ సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిచూపిస్తానని అన్నారు. కర్ని గ్రామంలో ఈ రోజు తన మద్దతుదారులతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి(Minister Dr. Vakiti Srihari) సహకారంతో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానని సంక్షేమ పథకాలు నిరుపేదలకు వచ్చే విధంగా చూస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గ్రామంలోని ప్రతి సమస్యను తెలిసిన, అవగాహన కలిగిన వ్యక్తిగా నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవచేసేభాగ్యం కల్పించాలని ఓటర్లను అభ్యర్తించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేయడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానని, ఆదరించి ఓటువేసి గెలిపిస్తే గ్రామ రూపురేఖలు మారుస్తానని అన్నారు.

Leave a Reply