నంద్యాల బ్యూరో, జులై 31 (ఆంధ్రప్రభ) : నంద్యాల జిల్లా (Nandyal District) లోని ఆళ్లగడ్డ నియోజకవర్గం (Allagadda Constituency) దొర్నిపాడు (Dornipadu) వద్ద గురువారం బైక్ యాక్సిడెంట్ (Bike accident) అయి రోడ్డుమీద పడి ఉన్న వ్యక్తిని రాష్ట్ర రోడ్ అండ్ భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి గుర్తించి, తక్షణమే స్పందించారు.
ఈ ప్రమాదంలో రోడ్డుపై పడి ఉన్న యువకుడిని గుర్తించి.. వెనువెంటనే కాన్వాయ్ ఆపి.. ఆటో పిలిపించి.. యాక్సిడెంట్ లో గాయపడ్డ వ్యక్తిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని మంత్రి బీసీ ఆదేశించారు. ఆళ్లగడ్డ ప్రభుత్వాస్పత్రి వైద్యులతో మాట్లాడి గాయపడ్డ బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఆదేశించారు. ప్రమాద ఘటన చూసిన వెంటనే మంత్రి కాన్వాయ్ ఆపడం, ఆయన స్పందించిన తీరు, బాధితుడికి ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడం.. ప్రత్యక్షంగా చూసిన స్థానికులు మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.