సీఎం రేవంత్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి అజారుద్దీన్

హైదరాబాద్‌, (ఆంధ్రప్రభ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మంత్రి మహమ్మద్‌ అజారుద్దీన్‌ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్‌కి ప్రభుత్వ రంగ సంస్థలు, మైనారిటీ సంక్షేమ శాఖల బాధ్యతలు కేటాయించిన నేపథ్యంలో, సీఎం రేంత్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, మైనారిటీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది.

Leave a Reply