విజయనగరం, జులై19 (ఆంధ్రప్రభ): గోవా రాష్ట్ర గవర్నర్ (Goa State Governor) గా నియమితులైన మాన్సాస్ చైర్మన్, మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు (Pusapati Ashoka Gajapati Raju) కి రాష్ట్ర హోం అండ్ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అభినందనలు (Congratulations) తెలిపారు.
శనివారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎం ఎస్ ఎం ఇ, సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి, పూసపాటి అతిధి గజపతిరాజు పాల్గొన్నారు.