TG | సీఎం రేవంత్ కు మంత్రి అడ్లూరి కృతజ్ఞతలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ( Minister Adluri Laxman Kumar) కృతజ్ఞతలు తెలియజేశారు. సోమవారం సీఎం కలిసి పుష్ప గుచ్చం అందించి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని తెలియజేశారు. మాదిగ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పించారని, ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ (Congress) పార్టీకి రుణపడి ఉంటానని తెలిపారు.

Leave a Reply