minister l మంథని టౌన్ ను మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం….

minister l మంథని టౌన్ ను మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం….
అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం
నిరుద్యోగుల సమస్యకు పరిష్కారం చూపిస్తాం
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు
minister l మంథని, ఆంధ్రప్రభ: యువతను ప్రోత్సహించడమే లక్ష్యంగా అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపెట్టేలా కార్యచరణ చేపడతామని తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ ఎన్నికలలో చివరి రోజు ఎలక్షన్ ప్రచారంలో భాగంలో శ్రీపాదరావు విగ్రహం నుండి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ…కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను నిరుపేద కుటుంబాలకు అందజేస్తూ ముందుకు వెళ్తుందని ఎక్కడ కూడా అవినీతి జరగకుండా నేరుగా పేదలకు చేరవేస్తున్నామని అన్నారు. రానున్న రోజులలో మరింత మంథని పట్టణాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో మంథని నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకురావడం జరిగిందనీ వెల్లడించారు.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 13 మంది అభ్యర్థులను గెలిపించడం ద్వారా మంథని పట్టణ అధిక నిధులు కేటాయించి అభివృద్ధి జరుగుతుందని పనిచేసే వారికే ఓటు వేయాలని కోరారు. ప్రతిపక్షాలకు ఓటు వేయడం వృథా అని తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లులు, మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కుట్టుమిషన్ల ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. ఇప్పటికే మంథిని మున్సిపల్ కార్యాలయం సంబంధించినటువంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి, దరఖాస్తుదారులు ఎవరైనా వచ్చిన వెంటనే దరఖాస్తుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి వారికి త్వరితగతిన విచారణ చేసి పనులు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ప్రతి ఒక్కరికి వైద్యం అందాలనే ఉద్దేశంతో మంథనిలో ఐదు పడగల డయాసిస్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎంపీడీవో ఆఫీస్ దగ్గర్లో నూతన 50 పడకల ఆసుపత్రికి నిర్మాణ పనులు జరుగుతున్నాయని త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకొని మన మంథని పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రతి ఒక్కరూ చేతి గుర్తు పై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ 13 వార్డు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి శ్రీధర్ బాబు మంథని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 13 వార్డులకు సంబంధించిన మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు,మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు
