minister l కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..

minister l కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం..
ఆడబిడ్డ రజిత ను గెలిపించండి….అభివృద్ధి కోసం ముందుంటా
ఆరవ వార్డులో పోలు రజిత గెలుపు ఖాయం
హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి
- మంత్రి శ్రీధర్ బాబు
minister l మంథని ఆంధ్ర ప్రభ: మంథని మున్సిపల్ పరిధిలో అరవ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోలు రజిత శివ ఆడబిడ్డను గెలిపించండి అభివృద్ధికి అండగా ఉంటానని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రజల కోసం పనిచేసే ఆడబిడ్డ రజిత ను గెలిపించండి సమన్యాయ పరిపాలన అందజేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి విస్తృతంగా ప్రచారం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రచారానికి అడుగడుగున జనాలు బ్రహ్మరథం పట్టారు. అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు వరాల జల్లులు కురిపించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి, అభివృద్ధి మరింత చేసి చూపిస్తానని ఆయన తెలిపారు. ఆరవ వార్డ్ ప్రజలు ఆశీర్వదించి హస్తం గుర్తుకు ఓటేయాలని, ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. సామాన్యులకు కాంగ్రెస్ పార్టీ టికెట్ అందించిందని, ప్రజా ప్రభుత్వం విజయం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని ఆయన పేర్కొన్నారు.
