Minister | మంత్రి సహకారంతో పగిడిమరి అభివృద్ధి చేస్తా.

Minister | మంత్రి సహకారంతో పగిడిమరి అభివృద్ధి చేస్తా.

Minister | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో పగిడిమారి గ్రామాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సర్పంచ్ ఎండి జాఫర్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పగిడి మారిలో మంత్రి ఆదేశాల మేరకు మొరంమట్టి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు దశలవారీగా పరిష్కరించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు.

ప్రజలు గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధికి నిధులు తీసుకువచ్చి గ్రామంలోనెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో గెలుపొందానని గ్రామ రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తానని అన్నారు. గ్రామంలోనిగోపాలోని కుంట వార్డులో రహదారి గుంతల మయంగా ఉండడంతో మొరం మట్టి వేశామని త్వరలో సీసీ రోడ్డు డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు.

పగిడి మారి గ్రామాభివృద్ధికి తన కృషి చేస్తానని మంత్రి ఆశీర్వాదంతో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆసిఫా, ఉప సర్పంచ్ రాఘప్ప, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply